News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 16, 2026
41-44°C టెంపరేచర్.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో 41-44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో 36-40°C వరకు టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. జిల్లాల వారీగా వివరాలను రెండో ఫొటోలో చూడొచ్చు.
News April 16, 2026
మారేడుమిల్లి: అడవి దున్న దాడి.. వ్యక్తి మృతి

మారేడుమిల్లి మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి(42) గురువారం గొర్రగేదె (అడవి దున్న) దాడిలో మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. కొండ సమీపంలో తన జఫ్రా తోటలో పని చేస్తుండగా అడవి దున్న దాడి చేయడంతో స్పాట్‌లోనే మృతి చెందాడని చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మారేడుమిల్లి మండలంలో గొర్రగేదెలు మందలుగా సంచారిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.
News April 16, 2026
సింహాచలంలో రేపు ఆర్జిత సేవలు బంద్

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.


