News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 16, 2026

కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్‌ల వద్ద పక్కాగా నివారణ చర్యలు తీసుకోవడం వల్ల 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. గాంధారిలో గురువారం జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ కోరారు.

News April 16, 2026

TG DEECET దరఖాస్తుల సవరణకు అవకాశం

image

TG DEECET-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.

News April 16, 2026

గాంధారి: నిర్లక్ష్యం వద్దు.. నిబంధనలు ముద్దు: అదనపు డీజీపీ

image

గాంధారిలో గురువారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో అదనపు DGP సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు. యుద్ధాల కంటే ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుత డ్రైవింగ్‌తోనే వీటిని నివారించవచ్చన్నారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకొవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. SP రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.