News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 17, 2026
హుకుంపేట: ఎన్డీపీఎస్ కేసులో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష

హుకుంపేట పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులో ఏ1 నిందితుడు విజయసాయికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1లక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 15న 462 కిలోల గంజాయి రవాణా చేస్తూ విజయసాయి పట్టుబడినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసుపై గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు విచారణ జరిగిందన్నారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.
News April 17, 2026
స్వీయ గణనలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

జనగణన–2027 స్వీయ గణన కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో నిర్ణీత పోర్టల్ ద్వారా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ విధానం పారదర్శకతను పెంచుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె కోరారు.
News April 17, 2026
పెంచలకోన ఆలయానికి రూ.6.50 కోట్లు

పెంచలకోన శ్రీఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రూ.6.50 కోట్లు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల తర్వాత పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విజ్ఞప్తి మేరకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంపైనా ఆగమ పండితుల సూచనలతో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.


