News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 19, 2026

అన్నమయ్య జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 12,886 మందికి 7969 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,832 మందికి 7,981 మందే పాసయ్యారు. 3,851 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.

News April 19, 2026

భీమవరంలో చికెన్ ధర ఎంతంటే?

image

భీమవరంలో ఆదివారం మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. బాయిలర్ కోడి కిలో రూ.300, ఫారం కోడి రూ.260కు చేరగా.. మటన్ ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే చికెన్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. చేపలు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి

News April 19, 2026

అనంత: గల్లంతైన బంగారం.. ఇంటి పెరట్లో ప్రత్యక్షం!

image

ఇంట్లో కనపడకుండా పోయిన 10 తులాల బంగారు ఆభరణాలు అదే ఇంటి పెరట్లో ప్రత్యక్షమయిన ఘటన అనంత(D) బుక్కరాయసముద్రంలో శనివారం జరిగింది. శివప్రసాద్, లక్ష్మి దంపతులు గత నెల 25న తాడిపత్రిలో పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చి నగలను కప్ బోర్డులో పెట్టారు. ఈనెల 4న మరో వివాహానికి వెళ్లేందుకు ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, లక్ష్మి పెరట్లో చెత్త ఊడుస్తుండగా ఆ ఆభరణాలు కనిపించాయి.