News March 29, 2024
10 సీట్లు కొట్టాల్సిందేనంటున్న కమలం పార్టీ

తెలంగాణలో కచ్చితంగా 10 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు బ్యాంక్ భారీగా పెరిగినట్లు భావిస్తోంది. పక్కాగా 10 సీట్లు, 35% ఓట్లు వచ్చే విధంగా పని చేయాలని అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు అయోధ్య రామమందిరం బాగా కలిసొస్తాయని కమలం పార్టీ అంచనా వేస్తోంది.
Similar News
News January 22, 2026
విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.
News January 22, 2026
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా దక్కించుకుంటానన్న <<18921246>>ట్రంప్<<>> సడన్‌గా రూట్ మార్చారు. ఫోర్స్ వాడనని ప్రకటించారు. ఆయన వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1.అమెరికా గ్లోబల్ ఇమేజ్ పాడవుతుందన్న భయం. 2.ప్రపంచ దేశాలన్నీ ఏకమై వ్యతిరేకించడం. 3.సైనిక దాడి చేస్తే NATO, UN రూల్స్ బ్రేక్ అవుతాయి. 4.మిత్రదేశాల మధ్య గ్యాప్ వచ్చే రిస్క్ ఉండటం. 5.USలోనే సపోర్ట్ లేకపోవడం.
News January 22, 2026
అభిషేక్ రికార్డు

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్‌వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.


