News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 17, 2026
NZB: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు: కవిత

ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి 28 నెలల గడుస్తున్నా మాట ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టే నిరసన ప్రదర్శనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు.
News April 17, 2026
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

TGE-JAC పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడి PRC, పెండింగ్ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
News April 17, 2026
ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.


