News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 19, 2026

విజయవాడ: APSSDC ఆధ్వర్యంలో కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్!

image

విజయవాడలోని KP నగర్-లోహియా టవర్స్‌లో ఉన్న క్యాంపస్2కెరీర్ కార్యాలయంలో ఈ నెల 22న కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు APSSDC అధికారులు తెలిపారు. బీటెక్, డిగ్రీ, పీజీ చదివిన 21-35 ఏళ్లలోపు అభ్యర్థులు జాబ్ డ్రైవ్‌కు హాజరుకావొచ్చని.. ఎంపికైన వారికి నెలకు రూ.15-30వేల వేతనం ఉంటుందన్నారు. అకడమిక్ అడ్వైజర్, టీం లీడర్ (50) ఉద్యోగాలను భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

News April 19, 2026

అక్షయ తృతీయ.. ప్రకాశంలో బంగారం ధరలు ఇలా..?

image

అక్షయ తృతీయ కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. పసిడి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నా.. కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం 24 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ.1,54,100గా ఉంది. 22 క్యారెట్ల తులం రూ.1,42,500 పలుకుతోంది.

News April 19, 2026

విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

image

ఇన్‌కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.