News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 26, 2025

కామారెడ్డి: అటకెక్కిన ‘ఇందిరమ్మ’ మోడల్ హౌస్ నిర్మాణం!

image

సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులు తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో అవగాహన కల్పించేందుకు ప్రతి మండలలో ఒక ‘ఆదర్శ ఇందిరమ్మ ఇల్లు’ నిర్మించాలని నిర్ణయించింది. అయితే, పిట్లంలో ఈ ఆదర్శ గృహ నిర్మాణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. పనులు ప్రారంభమై తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. సగంలోనే ఆగిపోయి దర్శనమిస్తోంది.

News December 26, 2025

2026: అడ్మినిస్ట్రేషన్ నామ సంవత్సరంగా..!

image

TG: CM రేవంత్ రెడ్డి 2026లో పరిపాలనపై పూర్తి ఫోకస్ ఉంటుందని సంకేతాలిచ్చారు. ప్రభుత్వ పాలసీల లీక్ ఆగడం, రెవెన్యూ పెంపు తదితరాలకు అధికారుల్లో తనకు పట్టు ముఖ్యమని గ్రహించి ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో 3గం. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పనితీరుపై ప్రతి నెలా CS రివ్యూ చేస్తారని, 3 నెలలకు ఓ సారి తానే సమీక్షిస్తానని చెప్పారు. అన్ని శాఖల్లో పేపర్లకు బదులు e ఫైల్స్ అమలు చేయాలని ఆదేశించారు.

News December 26, 2025

జీవీఎంసీలో ఇక నుంచి 10 జోన్‌లలో పరిపాలన

image

మహా నగరం విశాఖ శరవేగంగా విస్తరిస్తుంది. జీవీఎంసీ పరిధిలో జోన్‌ల పునర్వ్యవస్థీకరణ పూరైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న ఎనిమిది జోన్‌లను పది జోన్‌లుగా విభజించారు. అగనంపూడి, మర్రిపాలెం వద్ద రెండు జోన్లను ఏర్పాటు చేశారు. ఆ రెండు జోన్లకు జోనల్ కమిషనర్లు, ఇతర కార్యాలయ సిబ్బందిని కూడ నియమించారు. జనవరి 1 నుంచి అమలు అయ్యే విధంగా జీవీఎంసి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.