News March 29, 2024

చేతులు కలిపిన అంబానీ, అదానీ!

image

భారత వ్యాపారరంగ దిగ్గజాలైన అంబానీ, అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీకి చెందిన మహాన్ ఎనర్జైన్ లిమిటెడ్ పవర్ ప్రాజెక్టులో ఇద్దరూ భాగస్వాములు కానున్నారు. ప్రాజెక్టులో 26శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేసింది. అందులోని 500 మెగావాట్ల విద్యుత్‌ను తమ అవసరాలకు వినియోగించుకోనుంది. వ్యాపారాల్లో పోటాపోటీగా ఉండే దిగ్గజ సంస్థలు ఇలా వాటాదారులు కావడం ఆసక్తికరంగా మారింది.

Similar News

News April 18, 2026

సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

image

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.

News April 18, 2026

హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

image

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.