News March 29, 2024

విశాఖ: మరికొన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీస్‌ ఓటర్లతోపాటు మరికొన్ని వర్గాలకు ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రధానంగా 80 ఏళ్లు దాటిన వారిని, దివ్యాంగులను (40 శాతానికి పైబడి వైకల్యం కలిగిన), విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులను పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేవారి జాబితాలో చేర్చారు. దీంతో జిల్లాలో 30 వేల మందికి పైబడి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది.

Similar News

News September 8, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

image

విశాఖపట్నం కలెక్టరేట్‌లో 8వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News September 8, 2025

విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో అగ్నిమాపక డీజీ సమీక్ష

image

అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ వెంకటరమణ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని IIM క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో NOC జారీ ప్రక్రియ సులభతరమైందని, కార్యాలయాలకు రాకుండా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పొందుతున్నారన్నారు. ఈ జోన్‌లో మరో ఆరు అగ్నిమాపక కేంద్రాలను రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.13.9 కోట్లతో శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామన్నారు.

News September 8, 2025

సాగర్ తీరంలో ముగిసిన ఫుడ్ ఫెస్టివల్

image

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సాగర్ తీరంలో 3 రోజులపాటు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆదివారం రాత్రితో ముగిసింది. 40 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా ఆదివారం రాత్రి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, టూరిజం జేడీ మాధవి, ఇతర ఉన్నత అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ 3 రోజులు లక్షల మంది ఫెస్టివల్లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.