News March 29, 2024
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పండింది. ఈ ఘటనలో 45 మంది మరణించారు. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడగా.. ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 6, 2024
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు.. కారణమిదే!
AP: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, YCP హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.
News November 6, 2024
ట్రంప్ జోరు: మళ్లీ కిచెన్ సింక్ ఫొటో షేర్ చేసిన మస్క్
US ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ హవాను బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎంజాయ్ చేస్తున్నారు. వైట్‌హౌస్‌లో కిచెన్ సింక్‌తో అడుగుపెట్టినట్టు ఓ ఎడిటెడ్ ఫొటోను పోస్ట్ చేశారు. ‘LET THAT SINK IN’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఆయన ఇలాగే సింక్‌తో ఆఫీస్‌లోకి ఎంటరవ్వడం తెలిసిందే. ఆ తర్వాత తన విజన్‌కు అనుగుణంగా మార్పులు చేపట్టారు. వైట్‌హౌస్‌లో భారీ సంస్కరణలు ఖాయమని సింబాలిక్‌గా ఇలా చెప్పారు.
News November 6, 2024
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
ఏపీలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 2019లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటు పలు జిల్లాల్లో వ్యాపారుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది.