News March 29, 2024
జగిత్యాల: ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకున్న ఘటనలో కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనలో హెడ్ కానిస్టేబుల్ అశోక్‌పై శాఖ పరమైన చర్యల నిమిత్తం మల్టీ జోన్-1ఐజీకి నివేదిక పంపించామని, ఆ నివేదిక ఆధారంగా అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News September 9, 2025
KNR: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శం

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురా బొంబాయి స్కూల్ నుంచి రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ వేడుకల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు.
News September 9, 2025
KNR: ప్రజావాణికి 300 దరఖాస్తులు..

ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. 300 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేసి, పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, DRO వెంకటేశ్వర్లు, RDOలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.
News September 8, 2025
MOUలతో విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కొత్తపల్లి(H) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు “ట్రస్మా” అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు జేఈఈ, ఐఐటీ, నీట్ కోర్సు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో MOUలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు అందిస్తామన్నారు.