News March 29, 2024

విశాఖ: అప్పన్న తలనీలాల వేలం రూ.10.13 కోట్లు

image

సింహాచలం దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు గురువారం వేలం నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల 13 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన దొరై ఎంటర్ప్రైజస్ దీనిని సొంతం చేసుకుంది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఈవో పాలూరి నరసింగరావు, ఏఈ రాంబాబు, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు వేలం నిర్వహించారు.

Similar News

News September 29, 2025

2 విశాఖలో మాంసం విక్రయాలు బంద్

image

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖ నగరంలో అక్టోబర్ 2వ తేదీన జంతువధ చేయరాదని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కోరారు. ఆ రోజు నగరమంతా మాంసం విక్రయాల నిషేధం ఉంటుందన్నారు. ఎవరైనా చేపలు, ఇతరం మాంసం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీవీఎంసీ హెల్త్, పారిశుద్ధ్య విభాగ అధికారులు ఆరోజు తనిఖీలు చేయాలని కమిషనర్ ఆదేశించారు.

News September 29, 2025

విశాఖ: కాలుతో పరీక్ష రాసి టీచర్ అయ్యాడు..!

image

అవును మీరు చదివింది నిజమే. కొత్త‌వ‌లస మండలం గ‌నిశెట్టిపాలేనికి చెందిన జామి సింహాచ‌లం నాయుడికి పుట్ట‌క‌తోనే అంగ‌వైక‌ల్యం. విశాఖలో కష్టపడి చదివారు. మెగా డీఎస్సీలో ఎడ‌మ కాలుతో ప‌రీక్ష రాసి టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించాడు. దీంతో ఆయనను విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు.

News September 29, 2025

విశాఖలో మూడు బైకులు దగ్ధం

image

జాలరిపేటలో తెల్లవారుజామున మూడు బైకులు పూర్తిగా కాలిపోయాయి. మరో బైకు సగం కాలిపోయి ఉన్నాయని బాధితులు ఎంవిపి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ధనుంజయ్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా కావాలానే కాల్చేశారా.. లేక షార్ట్‌సర్క్యూట్ కారణమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.