News March 29, 2024
ఆదిలాబాద్: అయిదేళ్లలో 68 మంది మృతి
ఉమ్మడి ADB జిల్లాలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, చిన్నారులు ఈతకొట్టేందుకు బావులు, చెరువులకు వెళ్తున్నారు. నీటిలోతు తెలియక మునిగి మృతి చెందుతున్నారు. గత అయిదేళ్లలో 68 మంది ఈత రాక నీటిలో మునిగి మృతి చెందారు. హోలీ రోజున ఈత రాక 5గురు మృతి చెందారు. కొత్తవారు తప్పనిసరిగా శిక్షకుల సమక్షంలో ఈత నేర్చుకోవాలని పూర్తిగా నేర్చుకున్న తర్వాతే ఒంటరిగా ఈత కొటేందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 17, 2024
మందమర్రిలో కనిపించిన పెద్దపులి
మందమర్రిలోని శంకరపల్లి, KK 5 గని సమీపంలో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. కొద్దిరోజులుగా జన్నారం, కాసిపేట, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వలస కూలీలకు శంకరపల్లి వద్ద పులి కనిపించినట్లు తెలిపారు. శంకరంపల్లి సమీపంలో గుడారాల్లో ఉంటున్న తమ వైపు పెద్ద పులి వచ్చిందన్నారు. గుడారాల్లోని వారందరూ భారీగా కేకలు వేయడంతో అది శతలాపూర్ వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు.
News November 17, 2024
ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News November 16, 2024
నార్నూరు: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నార్నూర్ మండలంలోని గుంజల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గుంజాల గ్రామానికి చెందిన మేస్రం భుజంగరావు కుటుంబ తగాదాల కారణంగా తన కొడుకు బాలాజీని కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి బాలాజీని ఉట్నూర్ తరలించారు. కాగా అక్కడి వైద్యులు రిమ్స్ కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.