News March 29, 2024

HYD: KTRపై కేసు నమోదు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కేసు నమోదైంది. CM రేవంత్ రెడ్డిపై KTR అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని TPCC సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను KTR తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై IPC సెక్షన్లు 504, 505 కింద జీరో FIR నమోదు చేసి కేసును HYD బంజారాహిల్స్ PSకు బదిలీ చేశామని అక్కడి ఇన్‌స్పెక్టర్ సతీశ్ తెలిపారు. 

Similar News

News December 29, 2025

HYD‌లో భారీ అగ్ని ప్రమాదం.. ‘@2వేలు’

image

ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సుమారు 2,000కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతతో సహాయక చర్యలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వాహనాలు, పరికరాల కొరత కూడా సమస్యగా మారింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2025

HYD: మీ పిల్లలు మాంజా వాడుతున్నారా? జర జాగ్రత్త!

image

చైనా మాంజాతో పాటు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వివిధ రకాల మాంజాలతో ప్రమాదం పొంచి ఉంది. మాంజా ఎదుటివారికే కాదు పతంగి ఎగరేసే కుటుంబసభ్యులకూ డేంజర్ డేంజర్ అని గుర్తించాలి. కీసరలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి మాంజాతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు సంక్రాంతికి నిషేధిత మాంజా అమ్ముతున్నారు. అందరూ బాధ్యతగా భావించి ప్రమాదపు దారాలు అమ్మితే దగ్గరలోని PSలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

News December 28, 2025

HYD‌: ఐటీ హబ్‌లో Monday Blues!

image

IT కారిడార్లలో ఇప్పుడు ‘మండే బ్లూస్’ సరికొత్త రూపం దాల్చాయి. సండే నైట్ నుంచే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ‘సోమవారం భయం’ వెంటాడుతోంది. ‘బేర్ మినిమమ్ మండే’ పేరుతో కేవలం లాగిన్ అయ్యామనిపించడం, మీటింగ్‌లో కెమెరాలు ఆపేయడం, అత్యవసరమైతే తప్ప పని ముట్టుకోకపోవడం ఫ్యాషన్‌గా మారింది. కార్పొరేట్ కొలువుల్లో ఈ సోమరితనం మానసిక ప్రశాంతతా? లేక బాధ్యతారాహిత్యమా? అన్న చర్చ మొదలైంది. ​ఈ ‘మండే సిండ్రోమ్’ మీ ఆఫీసులోనూ ఉందా?