News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 8, 2026

ప్రచారం కొరవడిన ఫ్లెమింగో ఫెస్టివల్..!

image

తిరుపతి జిల్లా పులికాట్ సరస్సు తీరాన ఈ నెల 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అయితే దీనిపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సందర్శకుల కోసం బస్సులు, ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ఏర్పాటు అవుతున్నా దానిపై దృష్టి సారించాలంటే ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News January 8, 2026

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ <>(NSIL)<<>>16 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA/ICWA, డిగ్రీ, MBA, BE/BTech, MSW, MA, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. హార్డ్ కాపీని ఫిబ్రవరి 10లో పంపాలి. వెబ్సైట్: https://www.nsilindia.co.in

News January 8, 2026

ఎమ్మెల్సీ సారయ్య 2.0

image

వరంగల్ జిల్లాలో MLC బస్వరాజు సారయ్య మాటే శాసనంలా మారింది. ఎప్పుడో జరిగిన కేసుల్లో అక్రమార్కులను సస్పెన్షన్లు చేయిస్తూ, పోలీసులకు దడ పుట్టిస్తున్నారు. మరో పక్క మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సారయ్య పవర్ సెంటర్‌గా మారారు. పనుల కోసం మంత్రి దగ్గరి కంటే ఎమ్మెల్సీ దగ్గరికే ఎక్కువగా వస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మంత్రి పొంగులేటి రివ్యూలో సైతం అధికారులపై రుసరుసలాడటం చర్చనీయాంశంగా మారింది.