News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 7, 2026

BREAKING.. కొవ్వూరు జాతీయ రహదారిపై దగ్ధమైన బస్సు

image

తూ.గో. జిల్లా కొవ్వూరు గామాన్ బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తెల్లవారు జామున 3గం.కు బస్సు సెల్ఫ్ మోటార్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.

News January 7, 2026

US బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

image

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ వేళ US ఆర్మీ చేసిన మెరుపుదాడిలో 55 మంది వెనిజులా, క్యూబా సైనికులు చనిపోయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. వీరిలో వెనిజులాకు చెందిన 23, క్యూబా సైనికులు 32మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతిచెందిన తమ సైనికుల వయసు 26-27ఏళ్ల మధ్య ఉంటుందని క్యూబా చెప్పింది. అటు ఈ దాడుల్లో మదురో భద్రతా సిబ్బంది చాలా వరకు చనిపోయినట్లు వెనిజులా రక్షణ మంత్రి పాడ్రినో లేపెజ్ తెలిపారు.

News January 7, 2026

ధనుర్మాసం: ఇరవై మూడో రోజు కీర్తన

image

ఈ పాశురం కృష్ణుడి రాకను వర్ణిస్తుంది. సింహం మేల్కొన్నాక జూలు విదిల్చి గర్జిస్తూ బయటకు వచ్చినట్లు కృష్ణుడు తన శయనం నుంచి లేచి రావాలని గోపికలు కోరుతున్నారు. సింహంలా శత్రువులను హడలెత్తించే పరాక్రమం ఉన్నా, భక్తులతో సుందరంగా, దయతో వ్యవహరించే స్వామిని తమ అభీష్టాలను వినమని వేడుకుంటున్నారు. సింహాసనాన్ని అలంకరించి, తమ మొర ఆలకించి, మోక్షాన్ని ప్రసాదించమని ఆండాళ్ తల్లి స్వామిని ఆహ్వానించింది. <<-se>>#DHANURMASAM<<>>