News March 29, 2024
కొత్తకోట: పోక్సో కేసులో యువకుడికి రిమాండ్

ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడిని కొత్తకోట పోలీసులు జైలుకు పంపించారు. SI మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాటవెల్లికి చెందిన ఓ బాలికను వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
Similar News
News October 30, 2025
MBNR: వర్షపాతం వివరాలు

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. భూత్పూర్ 24.3, మూసాపేట మండలం జానంపేట 20.5, హన్వాడ 19.5, మహబూబ్ నగర్ అర్బన్ 17.0, మిడ్జిల్ 16.0, మహమ్మదాబాద్ 15.8, బాలానగర్ 13.3, దేవరకద్ర 12.8, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 10.8 అడ్డాకుల 8.5, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
News October 30, 2025
MBNR: వినియోగదారుల కోర్టులోకి వరద నీరు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని వినియోగదారుల కోర్టు ప్రాంగణంలో భారీ వర్షం కారణంగా నీరు చేరింది. 2 రోజుల కురిసిన వర్షంతో కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. వర్షం నీరు రాకుండా తగిన డ్రేనేజీ వ్యవస్థ లేనందున బుధవారం కూడా నీరు తగ్గకపోవడంతో కోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
News October 30, 2025
నంచర్ల గేట్ వద్ద కారు-బొలెరో ఢీ.. నలుగురికి గాయాలు

మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గేట్ బస్టాండ్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు-బొలెరో ఢీకొనడంతో కారులో ఉన్న విష్ణు, మల్లేష్, శేఖర్‌కు గాయాలయ్యాయి. బొలెరోలో కర్నూలుకు వెళుతున్న రోషన్‌కు కూడా తలకు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మెహబూబ్ బాషా, పైలట్ అక్బర్ అక్కడే ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.


