News March 29, 2024
KCRకు గడ్డు కాలం.. కారణం అదేనా?

కేసీఆర్ నాయకత్వంలోని BRS పదేళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించింది. జాతీయ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో ‘కారు’ టైర్లలో గాలి తగ్గింది. మంత్రులు, KCRకు అత్యంత సన్నిహితులూ ‘కారు’ దిగిపోతున్నారు. గతంలో కాంగ్రెస్, TDP నేతలను చేర్చుకోవడంపైనే గులాబీ బాస్ దృష్టి పెట్టారని, సొంత నాయకత్వాన్ని తయారు చేసుకోనందుకే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకుల మాట. మీరేమంటారు?
Similar News
News January 12, 2026
స్టార్‘లింక్’ కట్ చేసిన ఇరాన్.. ఎలాగంటే?

నిరసనలతో <<18832503>>అట్టుడుకుతున్న<<>> ఇరాన్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నెట్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. దీంతో దానిపై ఇరాన్ అటాక్ చేసింది. ‘కిల్ స్విచ్’గా పిలిచే అత్యంత ఖరీదైన మిలిటరీ గ్రేడ్ జామింగ్ పరికరాలతో 80% స్టార్‌లింక్ సేవలను నిలిపేసినట్లు తెలుస్తోంది. వీటిని ఇరాన్‌కు రష్యా, చైనా ఇచ్చి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
News January 12, 2026
విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.


