News March 29, 2024
తనఖా భూముల పాస్‌బుక్‌ల విడుదలకు గ్రీన్ సిగ్నల్

TG: తనఖా భూముల పాస్‌బుక్‌లను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి కారణంగా తనఖా పాస్‌బుక్‌ల రిలీజ్ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో అప్పులు చెల్లించినా రైతులకు పాస్‌బుక్‌లు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలగనుంది.
Similar News
News November 14, 2025
CSKకి సంజూ శాంసన్!

స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK ట్రేడ్ చేసుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ రాయల్స్‌తో పేపర్ వర్క్ పూర్తయిందని వెల్లడించాయి. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని పేర్కొన్నాయి. అటు జడేజాను వదులుకోవట్లేదని సమాచారం. మరోవైపు శాంసన్ వచ్చే సీజన్‌లో ఎల్లో జెర్సీలో కనిపిస్తారని CSK ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు వెల్‌కమ్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.
News November 14, 2025
నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.
News November 14, 2025
కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.


