News March 29, 2024
ఏలూరు: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య SUICIDE

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన చినవెంకట సాంబమూర్తి RDO ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్. ఆయనకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంకు చెందిన రాధిక(31)తో 2010లో పెళ్లైంది. రెండ్రోజుల కింద రాధిక ఊరివేసుకొని మృతి చెందింది. అదనపుకట్నం తీసుకురావాలని తరచూ భర్త వేధించడం వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
Similar News
News March 2, 2026
అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్

జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెబ్‌ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూల్యాంకనకు సిబ్బందిని నియమించాలన్నారు.
News March 2, 2026
యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

భీమవరంలోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
News March 1, 2026
గొల్లలకోడేరు కాదు.. వన్‌టౌన్ స్టేషన్‌కు రండి: SP

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలు, ఫిర్యాదులతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.


