News March 29, 2024
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు, 2-10 తరగతులకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన్ సూచించింది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి వివరాలకు కేవీ <
Similar News
News December 25, 2025
ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పులు.. జీవో జారీ

AP: హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కనిష్ఠంగా రూ.40వేల నుంచి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ఫీజు ఉండనుంది. 7 కాలేజీలకు మాత్రమే స్వల్పంగా ఫీజులు పెరిగాయి. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కింద అడ్మిషన్లు పొందిన వారికి 2024-25 నుంచి మూడేళ్ల కాలానికి ఇవే ఫీజులు అమలవుతాయి. కాగా గతంలో కనీస ఫీజు రూ.43వేలుగా ఉండేది.
News December 25, 2025
గర్భనిరోధక మాత్రలతో బరువు పెరుగుతారా?

గర్భనిరోధక మాత్రల వల్ల శరీరంలో కొన్ని రకాల ద్రవాలు నిలిచిపోవడం, శరీరంలో నీటి పరిమాణం పెరగడం వల్ల కాస్త బరువు పెరగవచ్చు. అంతే కాకుండా కొవ్వు లేదా కండర ద్రవ్యరాశి పెరగడానికి కూడా ఇది కారణం అవుతుంది. మరోవైపు కొంతమంది మహిళలు ఈ టాబ్లెట్ తీసుకునేటప్పుడు బరువు కూడా తగ్గుతారు. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి మరింత సమాచారం కావాలంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
News December 25, 2025
స్క్రబ్ టైఫస్.. 20కి చేరిన మృతుల సంఖ్య

APలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాపట్ల(D) పెదపులుగువారిపాలెంలో నాగబాబు(21) అనే యువకుడు ఈ వ్యాధితో మరణించాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ఈ పురుగు రాత్రి వేళల్లో <<18463813>>మనుషులను<<>> కుడుతుంది.


