News March 29, 2024
కరీంనగర్: ప్రవేశాలకు ఈ నెల 31న ఆఖరు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దూర విద్య డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం (2023-24) ప్రవేశాలు అపరాధ రుసుం రూ.200తో ఈనెల 31 వరకు పొందే అవకాశం విశ్వవిద్యాలయం కల్పించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఓపెన్ యూనివర్శిటీ కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 25, 2025
KNR జిల్లాలో 16 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీ

జిల్లా జనరల్ ఆసుపత్రిలో రెండు రోజులపాటు నిర్వహించిన గుండె వ్యాధి నిర్ధారణ శిబిరంలో 16 మంది చిన్నపిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమని గుర్తించినట్లు జిల్లా ఇమ్యూనైజన్ (డీఐవో) అధికారి డాక్టర్ సాజిద్ తెలిపారు. అపోలో ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 153 మంది పిల్లలు పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 23 మందికి చికిత్స అవసరమని, 14మందికి రివ్యూ నిర్వహించనున్నట్లు డీఐవో డాక్టర్ సాజిద్ తెలిపారు.
News October 25, 2025
వీణవంక: ప్రేమ వివాహ హత్య.. నలుగురికి జీవిత ఖైదే

సంచలనం సృష్టించిన వీణవంక ప్రేమ వివాహ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బ్రాహ్మణపల్లికి చెందిన ఎ.శ్రీనివాస్‌ను 2019లో ఆయన భార్య బంధువులు దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో నలుగురు కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. ఐపీసీ సెక్షన్ 302 r/w 34 కింద తీర్పునిచ్చిన కోర్టు.. నిందితులైన మండల ఓదేలు, సంపత్, దేవేందర్, లక్ష్మిలకు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1,000 జరిమానా విధించింది.
News October 25, 2025
KNR: ‘ఈనెల 30లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి’

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు OCT 30 లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్‌గా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ గడువు లోపు తమ ఫీజు చెల్లించాల్సిందిగా సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో NOV 15 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో DEC 2 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో DEC 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు.


