News March 29, 2024
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా 1,300 పెరగడంతో రూ.63,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.68,730కి చేరింది. దీంతో మార్కెట్ చరిత్రలో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు చేరాయి. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,800కు చేరింది.
Similar News
News March 24, 2026
ఎన్నికల వేళ కమల్ హాసన్ సంచలన ప్రకటన

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. ఇది త్యాగం కాదని, తన డ్యూటీ అని ట్వీట్ చేశారు. అయితే డీఎంకే కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఎన్నికల్లో కమల్ పార్టీకి డీఎంకే రెండు స్థానాలు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కమల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
News March 24, 2026
ఇంధన ఎమర్జెన్సీ.. ఫిలిప్పీన్స్ ఏం చేస్తోందంటే?

ఇంధన వనరుల(పెట్రోల్, గ్యాస్, విద్యుత్) కొరత ఏర్పడి ప్రజా సంక్షేమానికి ముప్పు కలిగే పరిస్థితే ఇంధన ఎమర్జెన్సీ. దీన్ని నివారించేందుకు ఫిలిప్పీన్స్ <<19467390>>ఎమర్జెన్సీ<<>> ప్రకటించింది. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు UPLIFT పథకంతో సాయం చేయనుంది. ఇంధన ఆదాకు చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపనుంది. 10 లక్షల బ్యారెళ్ల చమురును బఫర్ స్టాక్‌గా పెట్టనుంది. ఇంధన సరఫరాదారులకు ముందస్తు చెల్లింపులు చేయనుంది.
News March 24, 2026
KCR నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే: రేవంత్

కేసీఆర్‌తో తనకు వ్యక్తిగత సమస్యలు లేవని, ఆయన రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని TG సీఎం రేవంత్ TV9 సమ్మిట్‌లో తెలిపారు. కేసీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని విమర్శించారు. హరీశ్ రావు సీఎం అవుతా అన్నారని, వారసత్వ రాజకీయాల కోసం ఆ ఫ్యామిలీ పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్నదే తన లక్ష్యమని, BRS, BJP కలిసి వస్తే ఇద్దరినీ ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.


