News March 29, 2024
రాజేష్ మహాసేన పోస్ట్.. APR 1న ఏం చెప్పనున్నారు..?
రాజేష్ మహాసేన సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. ‘తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2019లో జగన్ కోసం పని చేసి మోసం పోయాం. తర్వాత జనసేన కోసం కష్టపడ్డా అవకాశం రాలేదు. TDP నుంచి అనివార్య కారణాలతో అవకాశం కోల్పోయాం. అందుకే ‘మహాసేన’ చెప్పినట్లు చేయాలనుకుంటున్నా. అదేంటో APR 1న తెలిజయేస్తా’ అని రాసుకొచ్చారు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News November 17, 2024
తుని – అన్నవరం మధ్య ఎయిర్ పోర్ట్
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో తుని- అన్నవరం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతాల మధ్య 787 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాంతం జిల్లాలోని అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది.
News November 17, 2024
తూ.గో జిల్లా బాలికపై అత్యాచారం
చాగల్లుకు చెందిన బాలిక(14)పై వరుసకు మేనమామ అయిన కమల్(22) అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం..బాలిక సమిశ్రగూడెం ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లో చదువుకుంటోంది. ఆధార్‌లో మార్పులు చేయడానికి తాడేపల్లిగూడెం వాసి కమల్‌ను బాలిక అమ్మమ్మ పంపింది. అతను తీసుకొచ్చి అత్యాచారం చేసి వాళ్ల ఇంట్లో అప్పగించాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News November 16, 2024
కోటనందూరులో యువతి అదృశ్యంపై కేసు నమోదు
కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం..తుని మండలం ఎన్ ఎస్ వెంకటనగరం చెందిన విమల (22) అనే యువతి శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం లేదని తండ్రి సింహాచలం ఫిర్యాదు చేశారన్నారు. యువతి ప్రతిరోజు కోటనందూరులో టైలరింగ్ శిక్షణ నేర్చుకునేందుకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల తెలిస్తే తమను సంప్రదించాలన్నారు.