News March 29, 2024
MBNR: బీఆర్ఎస్ MLC అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ భయం..!

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్యాంపులకు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఓటు వేశారా లేదంటే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అనే అంశంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. విజయం సాధించాలంటే దాదాపు 725 ఓట్లు రావాల్సి ఉంది. ఫలితం కోసం ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.
Similar News
News March 22, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

మహబూబ్‌నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
News March 21, 2026
పాలమూరు:GET READY.. నేడే రంజాన్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్- ఫితార్) మాసం నేపథ్యంలో సామూహిక ప్రార్థనల (నమాజ్) కోసం ఈద్గా, మస్జీద్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈద్ నమాజ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు గత నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ప్రతిరోజు ఐదు పూటలా నమాజ్, ప్రత్యేక తరావీ నిర్వహించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో నేడు సందడి నెలకొననుంది.
#ఈద్ ముబారక్
News March 20, 2026
MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.


