News March 29, 2024
హత్య కేసులో నిందితుడికి రిమాండ్

ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాంపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్సై యాదయ్య తెలిపారు. మండలంలోని తీదేడులో ఈ 23న అలకుంట్ల రాజుతో ఎల్లయ్య గ్రామ శివారులోని గొడవ పడ్డారు. తిరిగి అదే రాత్రి గ్రామంలో గొడవ జరిగిన విషయమై ఇరువురు మాట్లాడుతుండగా మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన ఎల్లయ్య కర్రతో రాజుపై దాడి చేయడంతో మృతి చెందాడు.
Similar News
News March 18, 2026
రాముడి పాదంతో రామడుగుగా మారింది ఈ గ్రామం

అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చింది. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.
News March 18, 2026
నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 18, 2026
బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.


