News March 29, 2024
HYD: GV పాయింట్లు అంటే ఏంటో తెలుసా..?

గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ప్రజలకు వందలసార్లు అవగాహన కల్పించినప్పటికీ రోడ్ల పక్కన ఇప్పటికీ చెత్త వేస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ చెత్త చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అలాంటి ప్రాంతాలను గుర్తించిన GHMC అధికారులు, వీటికి గార్బేజ్ వల్నరబుల్ (GV) పాయింట్లుగా పేరు పెట్టారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వీటిని తొలగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నారు.
Similar News
News April 1, 2026
HYD: ఆర్మీలో కొలువులకు మరో 10 రోజులే ఛాన్స్!

ఆర్మీలో చేరాలని కలలుగనే అభ్యర్థులకు ఊరట లభించింది. 2027 రిక్రూట్‌మెంట్ ఏడాదికి సంబంధించి దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. ఆసక్తి గల యువత <
#SHARE IT
News April 1, 2026
HYD: ‘HPV’కి మద్దతుగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్దతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో HPV వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని AAFA ఈ అవగాహన కార్యక్రమాలు చేయనుంది.
News April 1, 2026
FLASH: ‘GHMC’ ఖజానా ఫుల్ ‘ఖుష్’

నగరవాసులు పన్నుల చెల్లింపులో జోరు పెంచారు! గత ఆర్థిక సంవత్సరంలో GHMC పరిధిలో రూ.2,038 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, ఈసారి ఆ నంబర్ అమాంతం పెరిగింది. ఈ ఏడాది GHMCతో పాటు MMC, CMC కార్పొరేషన్లు కలిపి ఏకంగా రూ.2,556 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించాయి. ముందస్తు పన్ను చెల్లింపు రాయితీలు, కఠిన నిబంధనలే ఈ భారీ వసూళ్లకు కారణమని కమిషనర్ చెబుతున్నారు. అభివృద్ధి కోసం జనం స్వచ్ఛందంగా కదులుతుండటం విశేషం!


