News March 29, 2024
నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయిన అనిల్ (27) అనే వ్యక్తి గురువారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో గొడవ కారణంతోనే చనిపోయినట్లు స్పష్టం చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 21, 2025
నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 21, 2025
NZB: ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం: షబ్బీర్ అలీ

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ తన కుటుంబ అభివృద్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
News April 21, 2025
NZB: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో నిజామాబాద్‌లోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281