News March 29, 2024
HYD: స్వచ్ఛ ఆటోలకు చెత్త వేసేది కొంచమే..!

గ్రేటర్ HYDలో మెజార్టీ బస్తీ, మురికివాడల్లో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడంలేదని GHMC గుర్తించింది. ఇప్పటి వరకు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1.62 లక్షల ఇళ్లకు గాను 1.2 లక్షల ఇళ్లలో చెత్త సేకరణ చేయటం లేదని తేలిపోయింది. అంటే దాదాపు 76% ఇళ్ల నుంచి స్వచ్ఛ ట్రాలీ కార్మికులు చెత్త సేకరించడం లేదు. అధిక రుసుము, వాహనాలు పలు ప్రాంతాలకు వెళ్లకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు.
Similar News
News March 8, 2026
రూ.5,812 కోట్లతో మూసీ నది ప్రాజెక్టు ఫేస్-1

రూ.5,812 కోట్లతో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ఫేస్-1 పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.73.8 కోట్లు వెచ్చించనట్లు తెలిపారు. గాంధీ విగ్రహ వేదికకు రూ.22.6 కోట్లు, మ్యూజియం, భవనానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.79 కోట్లతో ఎలక్ట్రో-మెకానికల్ పనులు చేపట్టనున్నారు.
News March 8, 2026
HYD: యూట్యూబ్ చూసి డాలర్లలో సంపాదన!

HYD శివార్లలోని బాచుపల్లి, నిజాంపేట్ బస్తీల్లో ఇప్పుడు సీన్ మారింది. కుర్రాళ్లు సాయంత్రం అయితే చాలు కిరాణా కొట్టుల దగ్గర కూర్చుని ‘పైథాన్’ కోడింగ్ చిక్కుముడులు విప్పుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఆఫీసుల ఏసీ గదుల కంటే గల్లీలోని వేపచెట్టు కింద కూర్చుని విదేశీ క్లయింట్లకు ప్రాజెక్టులు చేసివ్వడమే వీరి స్టైల్. ఏ డిగ్రీలు లేకపోయినా యూట్యూబ్ చూసి నేర్చుకున్న విద్యతో డాలర్లు సంపాదిస్తున్నారు.
News March 8, 2026
HYD: ఈ వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

హైదరాబాద్‌లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ సరికొత్త వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై చెత్త, నిండిన బిన్లు, మురుగునాళాల సమస్యలపై పౌరులు ఇకపై నేరుగా 8125966586 నంబర్‌కు ఫొటో, లొకేషన్‌ను వాట్సాప్ చేయవచ్చు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారు.


