News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 9, 2026
హైదరాబాద్‌లోని NIRDPRలో ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PG (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ సైన్సెస్/ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ మేనేజ్‌మెంట్/సోషల్ వర్క్), B.Tech/M.Tech/MCA అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 22వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: http://career.nirdpr.in//
News January 9, 2026
నల్గొండ: పురపోరుకు ఎర్రజెండా సైన్యం సై!

మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని CPI, CPM పార్టీలు నిర్ణయించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాడర్, ఓటు బ్యాంకు కలిగిన ఆ పార్టీలు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ రెండు పార్టీలు పొత్తు కొనసాగిస్తూ మున్సిపాలిటీల వారీగా కలిసివచ్చే ప్రధాన పార్టీలతో సీట్ల సర్దుబాటును కొనసాగిస్తూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
News January 9, 2026
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బంకుల వద్ద భద్రత కోసం ఇరువైపులా 100 మీటర్ల మేర బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.


