News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 14, 2026

ఖమ్మం జిల్లాలో 1,43,320 మంది ఓటర్లు

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,43,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా ఏదులాపురంలో 45,256 మంది ఓటర్లు ఉండగా.. తక్కువగా కల్లూరులో 18,866 మంది ఉన్నారు. సత్తుపల్లి 28,830, మధిర 25,679, వైరా 24,689 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.

News January 14, 2026

వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

image

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

News January 14, 2026

CUSBలో 84 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB)లో 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in