News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.
News January 8, 2026
VZM: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో సుందరపేట సీహెచ్‌సీకి, డ్రైవర్‌ను కేంద్రాసుపత్రికి తరలించారు.
News January 8, 2026
KNR: పార్టీని వీడిన సంజయ్.. మున్సిపల్ వేళ కారుకు పంక్చర్!

జగిత్యాల BRSలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ BRSను వీడటంతో కేడర్‌ను సమన్వయం చేసే నాయకుడు లేక పార్టీ బలహీనపడుతోంది. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగా, మున్సిపల్ ఎన్నికల వేళ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన ఎల్.రమణ మౌనం వహించడం హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తుపై భరోసా ఇచ్చే వారు లేక గులాబీ నాయకులు ఇతర పార్టీలపై మెుగ్గు చూపుతున్నారు.


