News March 29, 2024

చిలకలూరిపేట: అజ్ఞాతంలోకి 12 మంది YCP కౌన్సిలర్లు.?

image

చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్‌కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Similar News

News April 2, 2026

ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

image

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న రూ.7,059 కోట్ల బిల్లులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులు జరిగేలా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

News April 2, 2026

ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ ఆక్టోపస్‌కి కేటాయింపు

image

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరిధిలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌ను OCTOPUS విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజ్ గత ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా, ఇప్పటివరకు తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద ప్రైవేట్ భవనంలో OCTOPUS విభాగం ఉంది.

News April 2, 2026

GNT: స్టాఫ్ నర్సు పోస్టులకు భారీ పోటీ.. 7,500 దరఖాస్తులు

image

పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. 150 కాంట్రాక్ట్ పోస్టులకు 7,500 దరఖాస్తులు అందాయి. మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేపడతారు. ఉద్యోగాల పేరుతో దళారులను నమ్మవద్దని RD శోభరాణి హెచ్చరించారు. కాగా గుంటూరు ఆర్డీ కార్యాలయం గత నెల నోటిఫికేషన్ ఇచ్చింది.