News March 29, 2024

ఘోరం.. 32,552 మంది పాలస్తీనియన్లు మృతి

image

ఇజ్రాయెల్-గాజాల మధ్య యుద్ధం ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ కాల్పుల్లో గాజా స్ట్రిప్‌లో 32,552 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 91 మందికి గాయాలయ్యాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతీకారంగా చేసిన ప్రతిదాడిలో అప్పుడు 1200 మంది చనిపోయారు.

Similar News

News April 6, 2026

భూమి నుంచి 4,06,773KM.. ఆర్టెమిస్-2 సరికొత్త చరిత్ర

image

నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,06,773KM దూరానికి చేరుకొని అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా నిలిచింది. 1970లో అపోలో-13 మిషన్ కంటే 2,500KM+ అధిక దూరం ప్రయాణించడం విశేషం. మరికొన్ని గంటల్లో వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరుకొని చుట్టూ పరిభ్రమించనున్నారు.

News April 6, 2026

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

image

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.

News April 6, 2026

త్వరలో సినిమాలకు త్రిష గుడ్‌బై?

image

TVK చీఫ్, హీరో విజయ్‌తో రిలేషన్‌పై రూమర్స్ నడుస్తున్న వేళ నటి త్రిష‌పై సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌పై చెప్పే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రేమ గురించి ఆమె ఇటీవల <<19575762>>ఇన్‌స్టాలో<<>> షేర్ చేసిన పోస్ట్‌తో ఇది మొదలైంది. ఇక రీసెంట్‌గా ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకపోవడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. అయితే దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది.