News March 29, 2024
DSC అభ్యర్థులకు రూ.1,500 ఆర్థిక సాయం.. 7 రోజులే గడువు

TG: ఇటీవల 11,062 పోస్టులతో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే BC అభ్యర్థులకు పుస్తకాల కోసం బీసీ స్టడీ సర్కిల్ రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికోసం <
Similar News
News January 17, 2026
పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.
News January 17, 2026
సార్.. జాబ్ క్యాలెండర్ ప్లీజ్: నిరుద్యోగులు

AP: ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గతంలో <<18617902>>ప్రకటించిన<<>> విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 25వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ Xలో పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు.
News January 17, 2026
ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.


