News March 29, 2024

టీడీపీలోకి మల్లెల రాజేశ్ నాయుడు.?

image

చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

Similar News

News November 6, 2025

GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

News November 6, 2025

సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

image

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు.

News November 6, 2025

గుంటూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 7న గుంటూరులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి హెలిపాడ్, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ప్రణాళికపై అధికారులకు సూచనలు చేసి సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.