News March 29, 2024

HYD: MMTSలకు దూరమవుతున్న ప్రయాణికులు

image

చౌకగా ప్రయాణించే అవకాశం ఉన్నా MMTSలను ప్రజలు అంతగా ఎక్కడం లేదు. రెండోదశలో 95 కి.మీ. తోడైనా ప్రయాణికులు పెరగలేదు. మెట్రోలేని మార్గాలతో పాటు శివార్లను కలుపుతూ నలువైపులా అందుబాటులోకొచ్చినా అదే పరిస్థితి. సమయపాలన పాటించకపోవడంతోనే ప్రయాణికులు దూరమయ్యారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ – సికింద్రాబాద్ మధ్య 10 సర్వీసులు ప్రతి రోజూ ఆలస్యంగా నడుస్తున్నాయని చెబుతున్నారు.

Similar News

News January 21, 2026

HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

image

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్‌గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్‌గా మారనుంది.

News January 21, 2026

HYD: భార్యను చంపి ‘STATUS’ పెట్టుకున్నాడు

image

‘నా పార్ట్‌నర్‌ను చేతులారా చంపేశా’నంటూ స్టేటస్ పెట్టుకున్నాడో భర్త. ఈ ఘటన బోరబండలోని రెహ్మత్‌నగర్లో జరిగింది. వనపర్తి(D)కి చెందిన రొడ్డె ఆంజనేయులు, సరస్వతికి 14 YRS క్రితం పెళ్లైంది. బతుకుదెరువు కోసం వచ్చి రాజీవ్‌గాంధీనగర్లో నివాసముంటున్నారు. భార్య హౌస్ కీపింగ్‌గా, భర్త కార్ల బిజినెస్ చేసేవాడు. ఈ క్రమంలో అనుమానం ఎక్కువవ్వడంతో సోమవారం నిద్రిస్తున్న <<18903197>>సరస్వతిపై ఆంజనేయులు రోకలిబండతో దాడి<<>>చేసి చంపేశాడు.

News January 21, 2026

HYD: VIT-D పుష్కలం.. 10 రోజుల్లో సాగు మెలకువలు

image

శరీరానికి VIT- Dని సంవృద్ధిగా అందించే పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది. 10 రోజుల్లో సాగు మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్నారా? విస్తరణ విద్యాసంస్థ, ప్రొ.జయ శంకర్ యునివర్సిటీ నిపుణులు వీటి సాగుపై నైపుణ్య శిక్షణను FEB 18- 28వరకు రాజేంద్రనగర్‌లో ఇస్తారు. ఆసక్తిగలవారు అప్లికేషన్ ఫామ్, సమాచారం కోసం వెబ్‌సైట్లు www.eeihyd.org/ www.pjtau.edu.inలో చూడాలని, అప్లై చేయడానికి FEB 8 వరకే అవకాశం ఉంటుందని తెలిపారు.