News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 24, 2026

సింహాచలం: రూ.15.55 కోట్లకు తలనీలాల షీల్డ్ టెండర్

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ ఆధ్వర్యంలో తలనీలాల షీల్డ్ టెండర్‌కు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.15.55 కోట్లకు తమిళనాడుకు చెందిన దురై ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు ఈ టెండర్ అమలులో ఉండనుంది. గత వేలం పాటలతో పోలిస్తే ఈసారి దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించిందన్నారు.

News March 24, 2026

డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

image

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.

News March 24, 2026

సిద్దిపేట: వేర్వేరు కారణాలతో ఇద్దరు యువకుల సూసైడ్

image

సిద్దిపేట జిల్లాలో వేర్వేరు కారణాలతో ఇద్దరు యువకులు సూసైడ్ చేసుకున్నారు. వర్గల్‌కు చెందిన కరుణాకర్ గౌడ్(36) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వర్గల్(M) నెమ్టూర్‌కు చెందిన <<19467591>>అశోక్<<>>(34) కుటుంబ తగాదాలతో నేపథ్యంలో మనస్తాపంతో ఉరేసుకున్నాడు.