News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 27, 2026

పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రకం: బండి సంజయ్

image

పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే వ్యాట్ (VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు. తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News March 27, 2026

భద్రాద్రి రాములోరి కళ్యాణం తిలకిస్తున్న CM దంపతులు

image

భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి గీతారెడ్డితోపాటు కూతురు నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి, మంత్రులతో కలిసి తిలకిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

News March 27, 2026

ఇబ్రహీంపట్నం: గురునానక్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలోని నందిగూడెం మండలం శ్రీరంగాపురానికి చెందిన సాయి(20) గురునానక్ కాలేజీలో ECE 2nd ఇయర్ చదువుతున్నాడు.