News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 20, 2026
తిరుపతి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారిగా హరీశ్

తిరుపతి జిల్లా ఎస్సీ వెల్ఫేర్&ఎంపవర్‌మెంట్ ఆఫీసర్ (DSCW & EO)గా వి.వి. హరీశ్ కొల్ల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హరీశ్ తెలిపారు.
News March 20, 2026
ఎటపాక: ఐదుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద <<19433230>>గల్లంతైన <<>>విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్‌ల మృతదేహాలను ఈతగాళ్లు వెలికితీశారు. మరో ముగ్గురు విద్యార్థులు తేజ, నవదీప్, సతీశ్‌ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. సరదాగా విహారయాత్రకు వచ్చి నదిలో గల్లంతు కావడంతో విద్యార్థుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.
News March 20, 2026
‘కాకినాడలో ఈనెల 24న జాబ్ మేళా’

ఈనెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఆరోజున ఉదయం10 గంటలకు ధ్రువపత్రాలతో కాకినాడ ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలన్నారు.


