News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
పాడేరులో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ముందస్తు ఉగాది కానుక అందించింది. 40% వైకల్యం ఉన్నవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు తీసుకొచ్చిన ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఈశ్వరి తెలిపారు.
News March 18, 2026
దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి కట్టుబడి ఉంది: అచ్చెన్న

శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ఈ పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సహాయకులకు 50% రాయితీ కల్పించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ..దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి కట్టుబడి ఉందని తెలిపారు.
News March 18, 2026
అక్రమాలకు అడ్డాగా ఖమ్మం DCCB

ఉమ్మడి ఖమ్మం DCCB ద్వారా 50 శాఖల్లో రూ.3 వేల కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా అధికారుల పర్యవేక్షణ లేక కొందరు మేనేజర్లు, సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై భూమి లేకపోయినా సరే నకిలీ డాక్యుమెంట్లపై లోన్లు మంజూరు చేస్తున్నారు. KMM రూరల్ మండలంలో కనీసం ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఫేక్ డాక్యుమెంట్స్‌పై రూ.లక్షల్లో లోన్లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరుపుతున్నామని DCCB CEO తెలిపారు.


