News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 2, 2026
ఆళ్లగడ్డ బస్టాండ్‌లో వడదెబ్బతో వృద్ధుడి మృతి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. దొర్నిపాడుకు చెందిన సాలయ్య(60) ఒంటిమిట్ట దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఆర్టీసీ బస్టాండ్‌లో మృతి చెందాడు. కోవెలకుంట్ల బస్సు ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వేచి ఉండగా వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఘటనా స్థలాన్ని డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సందర్శించారు.
News April 2, 2026
పార్లమెంట్‌లో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం

పార్లమెంట్‌లో మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు మండలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన విమర్శలు అవాస్తవమని మండిపడ్డారు. కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర నివేదికలే చెబుతున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడం తగదని, కేంద్రం విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరించవద్దని హితవు పలికారు.
News April 2, 2026
విద్యుత్ కాంతులతో కర్నూలు చారిత్రక కట్టడాలు

ఉభయ సభల్లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో గురువారం సాయంకాలం కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో సైతం కార్యాలయానికి అధికారులు ప్రత్యేక విద్యుత్ అలంకరణ చేశారు. జడ్పీ డిప్యూటీ సీఈవో ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులను వేసి సంబరాలు చేసుకున్నారు.


