News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
వనపర్తి: రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి- ఎస్పీ

రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఉపయోగించిన తర్వాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగిన కఠిన చర్యలు తప్పవని జిల్లా SP సునీత రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో విచారణ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ పడ్డీ కేసులను వేగవంతంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 14, 2026
తండ్రి మరణించినా.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. మరికొద్ది గంటల్లో పరీక్ష ఉండగా తండ్రి మరణించడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. అయినా, తండ్రి ఆశయం కోసం గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. బాధ్యతను గుర్తించి మణికంఠ చూపిన ధైర్యం తోటి విద్యార్థులను, స్థానికులను కలచివేసింది.
News March 14, 2026
KU: అధ్యాపకుడి నుంచి ఉప కులపతి వరకు!

ఆచార్య ఎన్.లింగమూర్తి 1981లో సీకేఎం కళాశాల నుంచి <<19382315>>కేయూలో <<>>ఎకనామిక్స్ అధ్యాపకుడిగా చేరారు. పలు హోదాల్లో పదోన్నతులు పొంది సేవలందించారు. అదే కాకతీయ విశ్వవిద్యాలయంలో 2007లో ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నారు. 2013లో పదవీ విరమణ పొందారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన అజాతశత్రువు కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల మాజీ రిజిస్ట్రార్ సదానందం, కేయూ అధ్యాపకులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.


