News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.
News March 13, 2026
అబ్రార్‌ది యునిక్ బౌలింగ్.. అందుకే తీసుకున్నాం: SRH హెడ్ కోచ్

The Hundred(ఇంగ్లండ్) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను తీసుకోవడంపై SRH హెడ్ కోచ్ వెటోరీ స్పందించారు. ‘అతనిది యునిక్ బౌలింగ్. ఎన్నో వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తారు. ఇలాంటి ప్లేయర్లను గతంలో చూసి ఉండరు. టోర్నీకి అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశాం’ అని పేర్కొన్నారు. కాగా పాక్ ఆటగాడిని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై వస్తున్న <<19368622>>తీవ్ర విమర్శలపై<<>> ఓనర్ కావ్యా మారన్ స్పందించలేదు.
News March 13, 2026
గుంటూరు జీజీహెచ్‌లో వాట్సాప్ ద్వారా OP చీటీ

గుంటూరు జీజీహెచ్‌లో ఓపీ చీటీ కోసం కొత్తగా వాట్సాప్ సేవలు ప్రారంభించారు. రోగులు 95523 00009 నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపితే సేవలు అందుబాటులోకి వస్తాయి. కావాల్సిన రోజు, విభాగాన్ని ఎంపిక చేసి ముందుగానే ఓపీ బుక్ చేసుకోవచ్చు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత వాట్సాప్ బుకింగ్ వివరాలు చూపిస్తే వెంటనే ఓపీ చీటీ ఇస్తారు. దీంతో క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రజలు ఈ సేవను ఉపయోగించుకోవాలన్నారు అధికారులు.


