News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం జనగామలోని సెయింట్ మేరీస్ స్కూల్, ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బయటి వ్యక్తుల ప్రవేశం నిషిద్ధమని స్పష్టం చేశారు.
News March 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,700
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,444
*వెండి 10 గ్రాముల ధర రూ.2,620.
News March 14, 2026
OTD: క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. 2001 కోల్‌కతా టెస్టులో టీమ్ ఇండియా ఫాలో-ఆన్ ఆడుతూనే ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు సృష్టించింది. VVS లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) నాలుగో రోజంతా వికెట్ పడకుండా పోరాడి భారత్‌కు 171 పరుగుల చరిత్రాత్మక విజయాన్ని అందించారు. దీంతో టెస్టుల్లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్‌కు బ్రేక్ వేశారు.


