News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 8, 2026
‘రేపు కలెక్టరేట్లో PGRS, రెవెన్యూ క్లినిక్’

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 8, 2026
ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు: సీఎం

AP: తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరని CM CBN కొనియాడారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తా. అప్పులు ఇప్పించే బాధ్యత నాది.. సద్వినియోగం చేసుకోవడం మీ పని. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష దాటారు. ఏడాదిలో మరో 5L మందిని తయారుచేస్తాం’ అని పేర్కొన్నారు.
News March 8, 2026
NLG: కొత్త వాహనాలపై రహదారి భద్రతా సెస్

జిల్లాలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై రహదారి భద్రతా సెస్ అమల్లోకి వచ్చింది. ద్విచక్ర వాహనాలకు రూ.2వేలు, తేలికపాటి వాహనాలకు రూ.5వేలు, కార్లు, ఇతర రవాణేతర వాహనాలకు రూ.10వేల వరకు సెస్ వసూలు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే వాహనాలపై 4% నుంచి 65% వరకు పన్ను విధించనున్నారు. దీంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.


