News March 29, 2024
బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్‌కు పాల్పడింది: కాంగ్రెస్

ఐటీ శాఖ రూ.1823.08 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్‌కు పాల్పడుతోందని.. తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయినా తగ్గేది లేదని స్పష్టం చేసింది. ‘BJP కూడా ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ పార్టీపై ఉన్న రూ.4600 కోట్ల పెనాల్టీలకు సంబంధించి కూడా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి’ అని డిమాండ్ చేసింది.
Similar News
News March 18, 2026
భారత్‌కు రెండు షిప్పుల్లో LPG.. ఒక్క రోజుకే సరిపోతుందన్న చిదంబరం!

శివాలిక్, నందాదేవి షిప్పుల్లో భారత్‌కు చేరుకున్న ఎల్పీజీ ఒకటిన్నర రోజులకు మాత్రమే సరిపోతుందని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం ట్వీట్ చేశారు. ‘మార్చి 14-17 మధ్య శివాలిక్, నందాదేవి షిప్పులు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి భారత్‌కు చేరాయి. ఈ 2 షిప్పులు కలిసి 92,700 మెట్రిక్ టన్నుల LPG తీసుకొచ్చాయి. గూగుల్ సమాచారం ప్రకారం దేశంలో ఉన్న ప్రస్తుత డిమాండ్‌కి ఇది 1.25 లేదా 1.6 రోజులకు సరిపోతుంది’ అని పేర్కొన్నారు.
News March 18, 2026
ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.


