News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 7, 2026

HNK: భీమారంలో లారీ బీభత్సం

image

భీమారం బస్టాప్ వద్ద శనివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన లారీ తొలుత ఆటోను ఢీకొట్టి, అనంతరం విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కన్నం రాణి(45) కాలు పూర్తిగా నుజ్జుకాగా, మంద విక్టోరియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ జనార్దన్ చేయి విరిగింది. గమనించిన 108 సిబ్బంది సురేశ్, కోటిలింగం తక్షణమే స్పందించి బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

News March 7, 2026

ఆసిఫాబాద్: పగలు ఉక్కపోత.. రాత్రి చలి!

image

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వింత వాతావరణం నెలకొంది. జిల్లాలోని 15 మండలాల్లో పగలు గరిష్టంగా 40C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, రాత్రికి కనిష్టంగా 12C కి పడిపోతున్నాయి. పగటిపూట భానుడి భగభగలకు, ఉక్కపోతకు అల్లాడుతున్న ప్రజలు.. రాత్రి వేళ చలికి వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతల్లో ఈ భారీ వ్యత్యాసంతో జిల్లా వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

News March 7, 2026

వనపర్తి జిల్లాలో 10 మంది తహశీల్దార్ల బదిలీ

image

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిపాలనా పరమైన కారణాలతో 10 మండలాల తహశీల్దార్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెబ్బేరు తహశీల్దార్ మురళి సర్వే సెటిల్మెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారులు వెంటనే విధులకు హాజరై రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ భారీ బదిలీలు జిల్లా రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.