News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

KNR: ఈనెల 17న ఇంటర్వ్యూ.. ఆర్టీసీ KNR RM

image

ఆర్టీసీ KNR రీజియన్‌లోని టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్‌కు FEB 24, 2026 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా మార్చి 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్ ఆర్టీసీ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీ, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.

News March 14, 2026

వనపర్తి జిల్లాలో భానుడి భగభగ.. 39.3°C నమోదు

image

వనపర్తి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కానాయిపల్లిలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 39.0°, గోపాల్‌పేటలో 38.9°గా నమోదయ్యాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

News March 14, 2026

హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

image

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.